![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -43 లో.. సిరి, ధనల పెళ్లి జరగాలంటే మాణిక్యం కండిషన్ పెడతాడు. వాళ్ళిద్దరి పెళ్లి జరగాలంటే రామలక్ష్మిని సీతాకాంత్ పెళ్లి చేసుకోవాలని మాణిక్యం చెప్పగానే అందరు షాక్ అవుతారు. నేను ఒప్పుకోనని సీతాకాంత్ తో పాటు శ్రీలత అంటారు. అయితే ఈ పెళ్లి జరగదని మాణిక్యం అనగానే.. సీతాకాంత్ కోపంగా మాణిక్యం పీక పట్టుకొని చంపేస్తానని అంటాడు. అప్పుడే సిరి మాటలు గుర్తుకి చేసుకొని వదిలిపెడతాడు.
నాకు తెలుసు.. నువ్వు నన్నేం చెయ్యలేవు అని మాణిక్యం అంటాడు. కాసేపటికి సీతాకాంత్ వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఎందుకు ఇలా చేస్తున్నావ్ దాని వయసు ఎక్కడ అయన వయసు ఎక్కడ అంటు మాణిక్యాన్ని సుజాత తిడుతుంది. అలా ఇంట్లో వాళ్ళంతా కలిసి మాణిక్యాన్ని తిడతారు.. మీరేం అన్న పడతాను కానీ రామలక్ష్మికి సీతాకాంత్ కి పెళ్లి జరగాల్సిందేనని మాణిక్యం అంటాడు. మరొక వైపు సీతాకాంత్, శ్రీలత, శ్రీవల్లి ఇంటికి వెళ్ళగానే.. ఏమైంది, అంతా ఒకేనా అని సిరి హ్యాపీగా అడుగుతుంది. సీతాకాంత్ సైలెంట్ గా వెళ్ళిపోతాడు. నువ్వు అయిన అక్కడ ఏం జరిగిందో చెప్పు అమ్మ అని శ్రీలతని సిరి అడుగుతుంది. మీ పెళ్లి జరగదు ఇక మర్చిపోమని సిరికి శ్రీలత వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత శ్రీవల్లి అక్కడ జరిగింది అంతా సిరి, పెద్దాయన, సందీప్ లకి చెప్తుంది. మాణిక్యం కండిషన్ విని పెద్దాయన హ్యాపీగా ఫీల్ అవుతాడు.
ఆ తర్వాత సీతాకాంత్ దగ్గరికి పెద్దాయన వచ్చి.. నువ్వు రామలక్ష్మిని పెళ్లి చేసుకమని అంటాడు. ఆ మోసగత్తిని పెళ్లి చేసుకోనని సీతాకాంత్ అంటాడు తను అమాయకురాలు.. నువ్వు తనని ఇష్టపడుతున్నావ్.. ఎవరితో మాట్లాడడానికి కూడా ఇష్టపడని నువ్వు.. తనతో మాట్లాడావ్ జాబ్ ఇచ్చావని పెద్దాయన అంటాడు. నాకు ఇష్టం లేదు ఆ మోసగత్తే అని సీతాకాంత్ అంటాడు. రామలక్ష్మికి ఏం తెలియదని నేను నిరూపిస్తాను.. నువ్వు తప్పకుండా పెళ్లి చేసుకుంటావా? నీ మౌనం అంగీకారమే అంటు పెద్దాయన వెళ్లిపోతాడు. మరొకవైపు మాణిక్యం దగ్గరికి రామలక్ష్మి వచ్చి... నేను సీతాకాంత్ ని పెళ్లి చేసుకోనని చెప్తుంది. ఎందుకు అని మాణిక్యం అనగానే.. ఎందుకో నీకు తెలియదా.. నా మనసులో ఎవరున్నారో నీకు తెలియదా.. అభి కోసమని రామలక్ష్మి ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |